హైదరాబాద్: 28°C
వార్తలు

ఉజ్జని నుంచి భారీగా వరద నీటి విడుదల

GDWL: భీమా నదిపై ఉన్న ఉజ్జని ప్రాజెక్టు నుంచి మంగళవారం ఉదయం 6 గంటలకు 60 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రవాహం మరో రెండు రోజుల్లో జూరాల ప్రాజెక్టు ఎగువనున్న కృష్ణానదిలో కలవనుంది. దీంతో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.