బాపట్ల: చీరాలలోని మసీద్ సెంటర్‌లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది. దీంతో తీవ్ర దుర్వాసన రావడంతో పాటు వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిలిచిన మురుగునీటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
వార్తలు
చీరాలలో డ్రైనేజీ సమస్య.. రోడ్డుపై చేరుతున్న మురుగునీరు


