హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: శ్రీ అంకమ్మ తల్లి సన్నిధిలో కోవూరు ఎమ్మెల్యే

NLR: విడవలూరు పట్టణంలోని శ్రీ అంకమ్మ తల్లి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గ్రామదేవత చల్లని దీవెనలు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఆకాంక్షించారు.