హైదరాబాద్: 28°C
వార్తలు

జన విజ్ఞాన వేదిక TS సమావేశం

HYD: కొత్తపేటలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ సమావేశం నిర్వహించారు. సమాజంలోని మూఢనమ్మకాలను నిర్మూలించి, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు గత 35 ఏళ్లుగా వేదిక చేస్తున్న కృషిని ప్రతినిధులు వివరించారు. జాతీయ అధ్యక్షురాలు స్వరాజ్య లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ జిల్లాల ప్రతినిధులతో పాటు JVV వ్యవస్థాపకులు డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.