హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చెత్తతో కాలనీవాసుల అవస్థలు

ASF: వాంకిడి మండల కేంద్రంలోని చీకలి వాగు సమీపంలో గ్రామ పంచాయతీ కార్మికులు చెత్తను వేయడంతో సమీప కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తలో పందులు సంచరిస్తూ దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు తెలిపారు. వర్షాకాలంలో దోమలు పెరిగి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించాలని కోరుతున్నారు.