తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని వసతులు కల్పించారు. నిన్న శ్రీవారిని 78,709 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,312 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.76 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు


