హైదరాబాద్: 28°C
వార్తలు

వివాహిత పరారీ, భర్తపై దాడి

GNTR: తెనాలి నందులపేటకు చెందిన మలిచయ్యకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. పెళ్లైన ఆరు నెలలకే తన భార్య మానికల సూర్య అనే వ్యక్తితో వెళ్లిపోయిందని తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నించడంతో సూర్య, అతని అన్న వాసు, మరికొందరు కలిసి మలిచయ్యతో పాటు అతని తమ్ముడు నరసింహపై దాడి చేసినట్లు ఆరోపించారు. ఆస్పత్రి నుంచి అందిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.