సత్యసాయి: సోమందేపల్లి మండలం చాకర్లపల్లి రైల్వే గేట్ వద్ద అధిక కట్టెల లోడుతో వెళ్తున్న లారీ ఇరుక్కుపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికుల సహకారంతో లారీని మెల్లగా వెనక్కి తీసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఈ ఘటనతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధిక లోడుతో నడిచే వాహనాలపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
ఇరుక్కుపోయిన లారీ.. ట్రాఫిక్ జామ్


