GNTR: శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న శాకాంబరీ దేవి ఉత్సవాల్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు పాల్గొన్నారు. ఆలంకార మండపంలో ఆలయ సిబ్బంది, శివసేవకులతో కలిసి నిమ్మకాయల మాలల తయారీలో సేవలందించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ప్రార్థించారు.
వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే మాధవి దంపతులు


