NDL: బనగానపల్లె పట్టణంలోని కరెంట్ ఆఫీస్ కాలనీలో బుధవారం నారాయణమ్మ అనే మహిళ మెడలో నుండి మూడు తులాల బంగారు గొలుసును ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్ళారు. నారాయణమ్మ తన ఇంటి ముందు చెత్త ఊడుస్తుండగా బైకుపై వచ్చిన దుండగులు గొలుసును దొంగిలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
బనగానపల్లెలో బంగారు గొలుసు చోరీ


