హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఉప్పొంగుతున్న బొగత జలపాతం

TG: ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది. అలాగే, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.