హైదరాబాద్: 28°C
వార్తలు

స్వర్ణగిరిలో ఘనంగా అష్టదళ పాదపద్మార్చన సేవ

BHNG: బుధవారం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందాలకు 108 బంగారు అష్టదళ పద్మపుష్పాలతో అష్టోత్తర శతనామాల మధ్య అష్టదళ పాదపద్మార్చన సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.