హైదరాబాద్: 28°C
వార్తలు

'కాలనీలో సమస్యలు పరిష్కరించండి'

PLD: పల్నాడు జిల్లా వి.రెడ్డిపాలెంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సరికొండ వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందించారు. పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలు అందించాలని, సైడ్ డ్రైనేజీలు ఏర్పాటు చేసి పక్కా ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.