హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చెత్తకుప్పలుగా మారిన రహదారులు

SDPT: సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటి చెరువు సమీప అవుటర్‌ రింగ్‌ రోడ్డు చెత్తకుప్పలకు నిలయంగా మారింది. అసంపూర్తిగా ఉన్న రహదారిపై గత కొన్ని రోజులుగా ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలించి వేస్తున్నారని స్థానికులు తెలిపారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఈగలు, దోమలు పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.