హైదరాబాద్: 28°C
వార్తలు

'మాజీ MLA కుమారుడి కేసులో కొత్త కోణం'

BPT: గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే కుమారుడు బషీర్‌పై నమోదైన కిడ్నాప్ కేసులో ఆర్థిక లావాదేవీల వివాదమే కారణమని పోలీసులు తెలిపారు. నూజివీడుకు చెందిన పొగాకు వ్యాపారి సూర్యచంద్రకు బషీర్ రూ.92 లక్షలు చెల్లించి పొగాకు సరఫరా చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఇందులో రూ.34 లక్షల విలువైన సరుకు ఇంకా రావాల్సి ఉందని, ఈ వివాదంపైనే కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.