NDL: చాగలమర్రి మండలంలోని నేలంపాడు, రాంపల్లి గ్రామాల్లో రైతులకు చెందిన మోటార్ కాపర్ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. బోర్ల వద్ద ఏర్పాటు చేసిన కాపర్ కేబుళ్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లడంతో ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన కేబుళ్ల విలువ రూ.లక్షకు పైగా ఉంటుందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
రైతుల మోటార్ కేబుళ్ల చోరీ


