హైదరాబాద్: 28°C
వార్తలు

చేనేత సంఘాలకు రూ.6 కోట్ల రుణాలు

కోనసీమ: జిల్లాలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ మహేష్ తెలిపారు. మంగళవారం చేనేత, జౌళి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 16 చేనేత సంఘాలకు 13 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. మూడు నాబార్డ్‌కు అనుసంధానంగా ఉన్నాయన్నారు. మిగిలిన 10 సంఘాలకు రూ.6.36 కోట్ల రుణాలు కల్పిస్తామన్నారు.