హైదరాబాద్: 28°C
వార్తలు

రాచర్ల బొప్పాపూర్‌లో భారీ వర్షాలకు కూలిన ఇల్లు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో భారీ వర్షాలకు గురువారం ముద్దం లక్ష్మీదేవయ్య ఇల్లు కూలింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. సర్పంచ్, గ్రామ కార్యదర్శి నష్టం వివరాలు సేకరించి ఎమ్మార్వోకు నివేదించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ వసతి కల్పించాలని కోరారు.