హైదరాబాద్: 28°C
వార్తలు

గద్వాలలో విద్యుత్ అంతరాయం

GDWL: గద్వాల మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శివకుమార్ తెలిపారు. ఈ అత్యవసర మరమ్మతుల నిమిత్తం పూడూరు, పూడూరు ఎర్రవల్లి, జంగంపల్లి, రేపల్లె, కొండపల్లి గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.