హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 74,471 మంది భక్తులు దర్శించుకోగా.. 31,319 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీనివాసుని హుండీకి రూ.4.68 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.