సిద్దిపేటలోని ఓ పాఠశాల విద్యార్థులు తమ పాకెట్ మనీ దాచుకుని సమాజ సేవలో ఆదర్శంగా నిలిచారు. వర్షాకాలంలో ఇల్లు లేక వానకు తడుస్తూ ఇబ్బంది పడుతున్న యాచకుల కష్టాలు చూసి చలించిపోయారు. తాము కూడబెట్టిన డబ్బులతో రెయిన్ కోట్లు కొనుగోలు చేసి వారికి పంపిణీ చేశారు. చిన్న వయసులోనే చిన్నారులు చూపిన ఈ పెద్ద మనసును స్థానికులు, పలువురు అభినందించారు.
వార్తలు
చిట్టి చేతులు.. గొప్ప మనసు..!


