హైదరాబాద్: 28°C
వార్తలు

'గుంటూరు RTC బస్టాండ్‌లో అధిక ధరల దోపిడీ'

GNTR: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల నుంచి MRP కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రూ.20 వాటర్ బాటిల్‌ను రూ.30కి విక్రయిస్తూ అదనపు మొత్తాన్ని పిండుకుంటున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వేలాది మంది వచ్చే ఈ బస్టాండ్‌లో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.