హైదరాబాద్: 28°C
వార్తలు

కన్వర్ యాత్రలో తీవ్ర విషాదం

యూపీలోని ముజఫర్‌నగర్‌లో నిర్వహిస్తున్న కన్వర్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివనామ స్మరణతో సాగుతున్న కన్వర్ యాత్రికులను వేగంగా వచ్చిన పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు యాత్రికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుండి వాహనంతో డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.