హైదరాబాద్: 28°C
వ్యాపారం

జూలైలో UPI లావాదేవీలు రూ.29.88 లక్షల కోట్లు

ఈ ఏడాది జూలైలో రికార్డు స్థాయిలో UPI పేమెంట్స్ జరిగినట్లు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. గత నెలలో జరిగిన UPI లావాదేవీల విలువ రూ.29.88 లక్షల కోట్లుగా పేర్కొంది. జూలైలో మొత్తం 23.66 బిలియన్ (2,366 కోట్ల) లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. గతేడాది జులైలో రూ.25.08 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ ఈసారి 19 శాతం పెరిగి రూ.29.88 లక్షల కోట్లకు చేరాయి.