BDK: భద్రాచలంలో గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 49 అడుగులుగా నమోదై, 12,34,930 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక అమల్లోనే ఉంది. భద్రాచలం వద్ద 43 అడుగులకు మొదటి, 48 అడుగులకు రెండో, 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 1986లో ఇక్కడ అత్యధికంగా 75.60 అడుగుల నీటిమట్టం నమోదైంది.
వార్తలు
భద్రాచలంలో శాంతిస్తున్న గోదావరి..!


