SRD: రాబోయే రెండు రోజులు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో లేదా చెట్ల కింద నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు.
వార్తలు
జిల్లాకు ఎల్లో అలర్ట్


