హైదరాబాద్: 28°C
వ్యాపారం

జూలై GST వసూళ్లు.. 2.11 లక్షల కోట్లు

దేశంలో జూలై నెలకు సంబంధించిన వస్తు, సేవల పన్ను(GST) వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది జులైతో పోలిస్తే ఇది 15.4 శాతం అధికం. ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.2.43 లక్షల కోట్ల GST వసూళ్లు నమోదయ్యాయి. జులై నెలలో కేంద్ర జీఎస్టీ (CGST) రూ.39,835 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ (SGST) రూ.47,881 కోట్లు, సమీకృత జీఎస్టీ (IGST) రూ.1.23 లక్షల కోట్లు వసూలయ్యాయి.