హైదరాబాద్: 28°C
వార్తలు

శేరిలింగంపల్లి పీహెచ్‌సీ దుస్థితిపై ఆందోళన

RR: శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెత్తాచెదారం పేరుకుపోయిందని స్థానికులు ఆరోపించారు. నీటి సంపులో బొద్దింకలు, పురుగులు, గార్డెన్‌లో ఖాళీ బీరు బాటిళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. రెండేళ్లుగా బోర్‌వెల్ పనిచేయక తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే శుభ్రత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.