హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRML: 11 కేవి కొండాపూర్ లైన్‌లో మరమ్మతుల దృష్ట్యా ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎడిఇ శ్రీనివాస్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా కొండాపూర్, రత్నాపూర్ కండ్లీ, తండా ఏరియాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.