హైదరాబాద్: 28°C
క్రీడలు

హిస్టరీ క్రియేట్ చేసిన గుల్వీర్ సింగ్

గ్లాస్గో వేదికగా కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. పురుషుల 5000 మీటర్ల పరుగులో గుల్వీర్‌ కాంస్యాన్ని సాధించాడు. దీంతో CWGలో రెండు ట్రాక్ మెడల్స్ సాధించిన తొలి భారతీయుడిగా గుల్వీర్ నిలిచాడు. ఇప్పటికే 10వేల మీటర్ల పరుగులో గుల్వీర్ రజతం సొంతం చేసుకోగా.. తాజాగా 5వేల మీటర్ల రేసులో కాంస్యం తన ఖాతాలో వేసుకున్నాడు.