హైదరాబాద్: 28°C
క్రీడలు

కామన్వెల్త్‌ గేమ్స్: భారత్‌కు మూడో స్వర్ణం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం వచ్చింది. 51 కిలోల మహిళల బాక్సింగ్‌ ఫైనల్‌లో సాక్షి చౌదరి ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్‌కు చెందిన రూబీ వైట్‌ను 5-0 తేడాతో చిత్తుగా ఓడించింది. భారత్‌కు బాక్సింగ్‌లో ఇది మూడో స్వర్ణం. మరోవైపు ఉన్నతి శర్మ 63 కిలోల జూడో విభాగంలో కాంస్య పతకం సాధించింది.