హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: భారత క్రికెటర్ రిటైర్మెంట్

టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానె రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. 'జీవితంలో ప్రతి పనికీ ఆరంభం, ముగింపు ఉంటుంది. ఇవాళ నేను ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చింది' అని పోస్ట్ పెట్టాడు. రహానే తన కెరీర్‌లో 85 టెస్ట్ మ్యాచ్‌లు, 90 వన్డేలు ఆడాడు. రహానె కెప్టెన్సీలోనే భారత్‌.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సాధించింది.