హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

ATP: బొమ్మణహల్ మండలం ఎల్బీనగర్ గ్రామంలో నిర్వహించిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో MLA కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్తూ కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ పాలనపై అభిప్రాయాలు సేకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.