హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పొలంలో రైతులు డాన్స్.. వైరల్..!

HNK: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి సాగు పనులు ఊపందుకున్నాయి. HNK(D) కమలాపూర్(M)లో మహిళా రైతులు వరినాట్లు వేస్తూనే జానపద గీతాలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేశారు. బురద పొలంలో చేతుల్లో వరి నారుతో అడుగులు వేస్తూ సందడి చేసిన దృశ్యాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ గా మారాయి.