హైదరాబాద్: 28°C
వార్తలు

అవార్డుల కమిటీ.. ఛైర్మన్‌గా లోకేష్

AP: రాష్ట్ర విద్యాశాఖ 2026 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ అవార్డుల కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందించే ఈ పురస్కారాల విజేతలను ఈ ఉన్నత స్థాయి కమిటీ తుది పరిశీలన చేసి ఖరారు చేయనుంది.