E.G: రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ గురువారం గ్రామీణ నీటి సరఫరా & పారిశుధ్య శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కొనసాగుతున్న, మంజూరైన వివిధ తాగునీరు, పారిశుధ్య పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
JJM పనులు త్వరితగతిన పూర్తి చేయాలి


