హైదరాబాద్: 28°C
వార్తలు

వంటశాల ఏర్పాటు చేయాలని వినతి

ATP: గుంతకల్లు ఎస్కేపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వంటశాల ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం పిడిఎస్సి విద్యార్థి సంఘం నాయకులు మండల ఇన్చార్జి గుమ్మనూరు నారాయణస్వామికి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కళాశాలలోనే భోజనం తయారు చేసే విధంగా వంటశాలను ఏర్పాటు చేయాలన్నారు.