హైదరాబాద్: 28°C
వార్తలు

చింతలాయపల్లెలో ఉచిత వైద్య శిబిరం

NDL: కొలిమిగుండ్ల (మం) చింతలాయలో గురువారం రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. డాక్టర్ సేనా రెడ్డి రోగులకు వైద్య పరీక్షలను చేశారు. అవసరమైన వారికి ఆయన ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాంకో సిమెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.