PPM: ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. మాధురి పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నారు. నకిలీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
వార్తలు
'అక్రమ రవాణాపై అవగాహన కలిగి ఉండాలి'


