హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇంకుడు గుంతలపై అవగాహన'

NZB: ధర్పల్లి మండలం వాడి గ్రామంలో సర్పంచ్ కట్ట గంగామోహన్ ఆధ్వర్యంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఏలు, ఉప సర్పంచ్ కుందేలు నర్సయ్య, గ్రామ కార్యదర్శి అలియాస్, ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు.