VSP: ఆంధ్ర విశ్వకళా పరిషత్ తెలుగు శాఖలో రచయిత రావిశాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కష్టజీవుల పక్షాన కలం పట్టిన రచయితగా రావిశాస్త్రిని సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. ఈ సభలో అడపా రామకృష్ణ, శిరేల సన్యాసిరావు పాల్గొన్నారు.
వార్తలు
ఏయూలో రావిశాస్త్రి జయంతి వేడుకలు


