హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఆర్కే బీచ్‌లో ఫ్లాష్‌మాబ్

VSP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా జూలై 31న ఆర్కే బీచ్‌లో జీవీఎంసీ ఆధ్వర్యంలో ప్రౌడ్లీ వైజాగ్’ థీమ్‌తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు మత్స్యదర్శిని వద్ద మెగా ఫ్లాష్‌మాబ్, 5:30 గంటలకు మత్స్యదర్శిని నుంచి కురుసురా సబ్‌మెరైన్ వరకు మెగా బీచ్ వాక్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.