KMR: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో మొదటి విడతగా 11 పాఠశాలలను ఎంపిక చేసి గ్రంథాలయాలను మంజూరు చేసింది. ఒక్కో గ్రంథాలయానికి రూ.15 వేల చొప్పున నిధులు కేటాయించగా, నిర్వహణ కోసం ప్రతి నెల రూ.వెయ్యి చొప్పున అందించనుంది. విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
వార్తలు
ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు


