BHPL: వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అవసరం లేకుండా బయటకు రావద్దని, వాగులు, వంకలు, చెరువులు, కల్వర్టుల వద్దకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి 9030632608 నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు.
వార్తలు
కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్


