హైదరాబాద్: 28°C
క్రీడలు

బంగ్లాదేశ్‌ కొత్త కెప్టెన్‌గా లిట్టన్ దాస్‌

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా సీనియర్ బ్యాటర్ లిట్టన్ దాస్‌ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో మెహిదీ హసన్ మిరాజ్ సారథ్యంలో జట్టు ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో నాయకత్వంలో మార్పు చేయాలని బోర్డు నిర్ణయించింది.