హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగాల నోటిఫికేషన్.. పట్నానికి పరుగులు

TG: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు పట్నం బాట పట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శిక్షణ కేంద్రాలు అభ్యర్థులతో కిటకిటలాడనున్నాయి. రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించిన మొత్తం 7,437 ఖాళీల భర్తీ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యువత, లక్ష్యాన్ని సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ, తమ ప్రిపరేషన్‌ను ముమ్మరం చేయడానికి సిద్ధమయ్యారు.