తమిళనాడులోని సేలంలో ‘విక్రమార్కుడు’ మూవీ గుండు సీన్ రిపీటైంది. కొత్త వ్యాధి సోకుతోందని.. గుండు చేయించుకుంటే మహిళలకు రూ.15 వేలు, కాలేజ్ యువతులకు రూ.45,000, ఉచిత ల్యాప్‌టాప్, పురుషులకు రూ.6,000 ఇస్తామని ఓ వ్యక్తి ఫోన్ చేసి నమ్మించాడు. దీంతో ముగ్గురు మహిళలు గుండు చేయించుకోగా.. తర్వాత ఫోన్ స్విచ్‌ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వార్తలు
తమిళనాడులో విక్రమార్కుడు గుండు సీన్ రిపీట్


