హైదరాబాద్: 28°C
వార్తలు

తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి గంట గంటకూ వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 88,653 క్యూసెక్కులుగా ఉండగా.. 24 గేట్లను ఎత్తి 89,496 క్యూసెక్కుల వరదను దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా.. ప్రస్తుతం 72.5 మీటర్లకు నీరు చేరింది.