AP: కర్నూలు జిల్లా ఆధోనిలో TDP నేతలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. BJP MLA పార్థసారథితో విభేదాలపై.. లోకేష్‌కు TDP నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. MLA వ్యవహార శైలి వల్ల అధికారం ఉన్నా.. ప్రతిపక్ష నేతల్లా ఉంటున్నామని చెప్పారు. తమ పనులు ఏవీ జరగడం లేదని లోకేష్ ముందు TDP నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై CM చంద్రబాబుతో చర్చిస్తానని పార్టీ నేతలకు లోకేష్ హామీ ఇచ్చారు.
వార్తలు
MLA పార్థసారిథిపై లోకేష్‌కు ఫిర్యాదు


