హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రముఖుల పోస్టులకు మరింత రక్షణ: మెటా

ప్రధాని మోదీ వీడియో సందేశాన్ని ఇటీవల ఫేస్‌బుక్ తొలగించడంపై వివాదం నెలకొంది. దీనిపై కేంద్రానికి తాజాగా ఫేస్‌బుక్ మాతృసంస్థ 'మెటా' లేఖ రాసింది. ఇక నుంచి ప్రధాని సహా ఇతర ప్రముఖుల అకౌంట్లలో పోస్టు చేసే కంటెంటుకు మరింత రక్షణ కల్పిస్తామని లేఖలో పేర్కొంది. ఈ పోస్టులపై ఇక నుంచి అదనపు పర్యవేక్షణ, సంస్థలో ఉన్నతాధికారుల స్థాయిలో పలు దశల్లో తనిఖీలు ఉంటాయని లేఖలో వివరించింది.